సినిమా వార్తలు

నాన్న ఆరోగ్యం మెరుగ్గానే ఉంది: బ్రహ్మానందం తనయుడు గౌతమ్


8 months ago నాన్న ఆరోగ్యం మెరుగ్గానే ఉంది: బ్రహ్మానందం తనయుడు గౌతమ్

ప్రముఖ తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందంనకు గుండె ఆపరేషన్ జరిగిందన్న విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలతచెందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన కుమారుడు, హీరో గౌతమ్ తెలిపారు. గత కొన్ని నెలలుగా  ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో బ్రహ్మానందం హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్లను సంప్రదించారు. వారి సలహా మేరకు శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్'లో ఈ నెల 14న గుండె ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయిందని,  ప్రముఖ హృదయ శస్త్రచికిత్స నిపుణులు తన తండ్రికి సర్జరీ చేసినట్టు గౌతమ్ చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చటం జరిగిందన్నారు. తన తండ్రికి శస్త్ర చికిత్స జరిగిందని తెలిసి అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారని, అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సుల వల్ల  తన తండ్రి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని గౌతమ్ తెలిపారు. కాగా, బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్థ్‌లు తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు.