సినిమా వార్తలు

‘వినయ విధేయ రామ’లో ‘దమ్ము’ పాళ్లు ఎక్కువే!


9 months ago ‘వినయ విధేయ రామ’లో ‘దమ్ము’ పాళ్లు ఎక్కువే!

బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తియిన  విషయం విదితమే. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రంలోని పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫ్యామిలీ పాట ఇదంటూ ముందే ప్రకటించి మరీ దర్శకుడు బోయపాటి ఈ పాటను విడుదల చేశారు. పాట చూడచక్కగా ఉంది. అలాగే పాటలోని విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇక పాటలోని విజువల్స్ గమనిస్తే గతంలో బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ‘దమ్ము’ సినిమాను గుర్తుకుతెస్తున్నదని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ‘దమ్ము’ సినిమాలోని ఎన్టీఆర్ లుక్ మాదిరిగా విదేయ రాముడిగా రామ్ చరణ్ కనిపిస్తున్నాడని అంటున్నారు. దీనికితోడు కుటుంబ నేపథ్యం కూడా చాలా పెద్దగా ఉన్నట్టుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కథ పరంగా తెలియకపోయినా, పాటను చూస్తుంటే మాత్రం ఎన్టీఆర్ దమ్ము లాగావుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అన్నదమ్ముల అనుబంధానికి తోడు భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. కాగా ఈ చిత్రంలోని ప్రత్యేక పాటను ఎవరు చేయబోతున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. రంగస్థలం చిత్రం తర్వాత రాబోతున్న చరణ్ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.