సినిమా వార్తలు

వితండ‌వాదం చేస్తున్న బోయ‌పాటి?


7 months ago వితండ‌వాదం చేస్తున్న బోయ‌పాటి?

‘విన‌య విధేయ రామ‌’ చిత్రం ఫ్లాప్ కాద‌ని, అది హిట్టు సినిమా అని ఆ సినిమా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి వితండ‌వాదం చేయ‌డం సినీ పెద్ద‌ల్ని సైతం విస్మ‌య‌ప‌రుస్తోంద‌ట‌. తాను హిట్టు సినిమానే తీశాన‌ని, వ‌సూళ్లు బాగా వ‌చ్చాయని కావాల‌ని సినిమా ఫ్లాప్ అయ్యింద‌ని ప్ర‌చారం చేస్తున్నార‌ని బోయపాటి వాదిస్తున్నార‌ట‌. మ‌రోవైపు త‌న‌ను అడ‌క్కుండా చ‌ర‌ణ్ అభిమానుల‌కు ఉత్త‌రం ఎలా రాస్తారు? అది న‌న్ను అగౌర‌వ‌ప‌రిచిన‌ట్టు కాదా? అని బోయ‌పాటి ప్ర‌శ్నిస్తున్నార‌ని బోగ‌ట్టా. ఓ సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ద‌ర్శ‌కుడు డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని ఏ చ‌ట్టంలో ఉంద‌న్న‌ది బోయ‌పాటి లాజిక్కులా ఉంది. గ‌తంలో దాన‌య్య తీసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయ‌ని, ఆయా ద‌ర్శ‌కులంతా డ‌బ్బులు వెన‌క్కి ఇవ్వ‌లేద‌ని బోయ‌పాటి గుర్తు చేశార‌ట‌. ఫైన‌ల్ గా చూస్తే ఈ వ్య‌వ‌హారం కేవ‌లం 5 కోట్ల‌తో ముడిప‌డి ఉన్న‌ది కాద‌ని ఇది ‘ఈగో’ స‌మ‌స్య‌గా మారింద‌ని తెలుస్తోంది. బోయ‌పాటి నుంచి డ‌బ్బులు తిరిగి రాబ‌ట్టాల్సిందే అని దాన‌య్య‌, ఇవ్వ‌కూడ‌ద‌ని బోయ‌పాటి మొండిప‌ట్టు ప‌డుతున్నార‌ట‌.దీంతో ఈ స‌మ‌స్య మ‌రింత జ‌టిలంగా మారేటా క‌నిపిస్తోంద‌ని సినీ వ‌ర్గాల టాక్‌!