సినిమా వార్తలు

బోల్తాకొట్టిన బోయ‌పాటి...పారితోషికంపై వేటు


8 months ago బోల్తాకొట్టిన బోయ‌పాటి...పారితోషికంపై వేటు

ఒక్క ఘోర ప‌రాజ‌యం వ‌స్తే చాలు.. ‘స్టార్’ హోదా ఢ‌మాల్ మంటుంది. మ‌రీ ముఖ్యంగా ద‌ర్శ‌కులపై నిర్మాత‌ల‌కు న‌మ్మ‌కాలు త‌గ్గిపోతాయి. బోయ‌పాటి శ్రీ‌ను విష‌యంలో ఇదే జ‌రిగింది. మొన్న‌టి వ‌ర‌కూ బోయ‌పాటి ఓ స్టార్ ద‌ర్శ‌కుడు. బోయ‌పాటి సినిమా అంటే విజ‌యం ఖాయం అనే ఫీలింగ్ ఉండేది. అయితే‘విన‌య విధేయ రామ‌’తో ఆ లెక్క‌ల‌న్నీ త‌ల‌కిందులైపోయాయి. బోయ‌పాటి ఎంత ఘ‌న‌మైన ఫ్లాప్ ఇవ్వ‌గ‌ల‌డో ఈ సినిమా నిరూపించింద‌నే టాక్ వినిపిస్తోంది. ఆ ఫ్లాప్ ప్ర‌భావం బోయ‌పాటిపై భారీగానే ప‌డింది. బోయపాటి పారితోషికం 15 కోట్లు. విన‌య విధేయ రామ‌కి ఆయ‌న‌ అందుకున్న మొత్తం ఇది. ఈ 15 కోట్లు నిక‌ర మొత్తంపై టాక్సులన్నీ.. నిర్మాతే భ‌రిస్తార‌ని స‌మాచారం.

అయితే ఈ పారితోషికంపై ఇప్పుడు భారీ కోత ప‌డింది. బోయ‌పాటి త‌రువాత‌ సినిమా బాల‌కృష్ణ‌తో ఉండ‌నుంది. ఇది ఏప్రిల్‌లో ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. ఈ చిత్రానికి బాల‌య్యే నిర్మాత‌. సింహాకి బోయ‌పాటి అందుకున్న పారితోషికం రూ3 కోట్ల లోపే ఉంద‌ట‌. ఆ త‌ర‌వాతే.. బోయ‌పాటి రేంజు పెరిగిపోయింద‌ట‌. లెజెండ్‌కి రూ.6 కోట్లు తీసుకున్న‌ట్టు చెప్పుకున్నారు.. ఇప్పుడు అదే పారితోషికాన్నే బోయ‌పాటికి...బాల‌కృష్ణ‌ ఫిక్స్ చేశారంటున్నారు.  ఇది బాల‌య్య సొంత సినిమా. బోయ‌పాటి కూడా ఈ సినిమాకు ఫిక్స్ అయ్యారని స‌మాచారం. ఓడ‌లు బ‌ళ్ల‌వ‌డం.. బ‌ళ్లు ఓడ‌ల‌వ‌డం అంటే ఇదేనేమో!