సినిమా వార్తలు

‘అరవింద సమేత’లో బాలీవుడ్ దిగ్గజం?


1 year ago ‘అరవింద సమేత’లో బాలీవుడ్ దిగ్గజం?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో నిర్మిస్తున్న అరవింద సమేత చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. దమ్ము తర్వాత ఫ్యాక్షన్ తరహా చిత్రంలో ఎన్టీఆర్ నటించడం ఇదే అవుతుంది. ఇటీవల విడుదలైన టీజర్‌ ఈ చిత్రంపై మరింత హైప్‌ను పెంచింది. తాజాగా ఈ చిత్రంలో అమితాబ్ నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలకు ధీటుగా రూపొందిస్తున్న అరవింద సమేత చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అరవింద సమేత సినిమా షూటింగ్ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్లను, ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను ఒక్కొక్కటి మీడియాకు వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. అరవింద సమేతలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబచ్చన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అయితే పాత్రకు సంబంధించిన వివరాలను చాలా సీక్రెట్‌గా ఉంచినట్టు సమాచారం. మెగాస్టార్‌ చిరంజీవితో మెగాపవర్‌స్టార్ రాంచరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సైరా నర్సింహారెడ్డి చిత్రంలోనూఅమితాబ్ బచ్చన్ నటించారు. ఈ చిత్రంలో సమరయోధుడు నర్సింహారెడ్డికి గురువుగా బిగ్‌బీ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు.కాగా 'అరవింద సామెత' షూటింగ్ లో ఏ సమయం లో పాల్గొని ఉండచ్చు అనే విషయం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వార్త గురించి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.