సినిమా వార్తలు

28న బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌


10 months ago 28న  బ్ల‌ఫ్  మాస్ట‌ర్‌

తనదైన ప్ర‌త్యేక మేనరిజం, పంచ్ డైలాగ్స్‌, హస్యంతో తెలుగు ప్రేక్షకులను అల‌రిస్తున్న‌ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తాజాగా నటించిన చిత్రం బ్లఫ్ మాస్టర్. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన శతురంగ వేట్టై సినిమాకు ఇది రీమేక్. తెలుగు వాతావ‌ర‌ణానికి అనుగుణంగా ఆసక్తికరమైన మార్పులు చేసి ఈ సినిమాను రూపొందించారు. సత్యదేవ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 28న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా బ్లఫ్ మాస్టర్ పృథ్వీ మాట్లాడుతూ ఈ సినిమాలో నా పాత్ర పేరు ధనశెట్టి. డబ్బు కోసం అత్యాశపడే గుణం కిలిగిన‌ పాత్ర అది. ఆ పాత్ర గెటప్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ధనశెట్టి పాత్ర కోసం నేను చాలా బరువైన, పాతకాలం నాటి చెవి దుద్దులు ధరించాను. శెట్టి పాత్ర కోసం చిన్న నెత్తికి ఆముదం రాసి, ముఖంపై మీసాలు పెట్టి పాత్ర గెటప్‌లో న‌న్ను చూపించారు.