సినిమా వార్తలు

బిత్తిరి సత్తి కూడా హీరో అయిపోయాడు


1 year ago బిత్తిరి సత్తి కూడా హీరో అయిపోయాడు

యాంకర్ బిత్తిరి సత్తి హీరోగా పరిచయమవుతున్న సినిమా తుపాకీ రాయుడు. సీనియర్ దర్శకులు టి ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి బాలకిషన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శరవేగంగా నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.....'బిత్తిరి సత్తిగా అందరికి పరిచయమైన సత్తి తుపాకీ రాయుడు సినిమాలో మరో కోణంలో కనిపించ‌నున్నారు. ఈ సినిమా సత్తికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సీనియర్ దర్శకుడైన ప్రభాకర్ ఈ సినిమాని ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించి ఉంటారని ఆశిస్తున్నాను. ఈ సినిమా అందరికి మంచి పేరు, సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. చిత్ర దర్శకుడు టి. ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు పుష్కలంగా ఉంటాయి. బిత్తిరిసత్తిని ఈ చిత్రంలో వైవిధ్యంగా చూపిస్తున్నాం. రసమయి బాలకిషన్‌ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాకి సహకరించారని అన్నారు.