సినిమా వార్తలు

బయోపిక్ అద్భుతం, ఎఫ్ 2 కామెడీ : రామ్ చరణ్


6 months ago బయోపిక్ అద్భుతం, ఎఫ్ 2 కామెడీ : రామ్ చరణ్

రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' చిత్రం సంక్రాంతి సందర్బంగా ఈ నెల 11న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో చరణ్ బిజీగా ఉన్నారు. మరోవైపు, ఈ సంక్రాంతి బరిలో నాలుగు భారీ చిత్రాలు ఉండటం ఆసక్తికరంగా మారింది. 9న బాలయ్య నటించిన 'కథానాయకుడు', 10న రజనీకాంత్ చిత్రం 'పేట', 11న 'వినయ విధేయ రామ', 12న వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటించిన 'ఎఫ్2' విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో, బాక్సాఫీప్ వద్ద విపరీతమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో చరణ్ స్పందిస్తూ, రెండు భారీ చిత్రాలను సంక్రాంతి సీజన్ ఆకామడేట్ చేయగలదని, వారం రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద మరో చిత్రాన్ని కూడా పెట్టవచ్చని అన్నారు.

ఈ సంక్రాంతి పోటీ గురించి తాను ఆందోళన చెందడం లేదని, అన్ని సినిమాలు హిట్ అవుతాయనే విశ్వాసం తనకు ఉందన్నారు. బాలయ్య నటించిన 'కథానాయకుడు' సినిమాపై చరణ్ మాట్లాడుతూ అది ఎంతో గౌరవనీయమైన చిత్రమని, ఎన్టీఆర్ పై ఎంతో గౌరవంతో ఆ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పాడు. ప్రతి ఒక్కరూ సినిమా కోసం ఎదురుచూసేలా బయోపిక్ ను దర్శకుడు క్రిష్ అద్భుతంగా తెరకెక్కించారని పేర్కొన్నారు. 'కథానాయకుడు' సినిమా కోసం తాను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటించిన 'ఎప్2' మూవీ సూపర్ హిట్ అవుతుందని  తెలిపాడు. వెంకీగారిలా మరెవరూ కామెడీ చేయలేరని, కుటుంబాలను ఆకట్టుకునేలా ఆయన చిత్రాలు ఉంటాయని చెప్పాడు. వెంకటేష్ పక్కన తన సోదరుడు వరుణ్ ఎలా చేశాడో చూడాలని ఉందని అన్నారు.