సినిమా వార్తలు

బిగ్‌బాస్ నుంచి రాగానే విలన్ గా కౌశల్?


1 year ago బిగ్‌బాస్ నుంచి రాగానే విలన్ గా కౌశల్?

‘బిగ్‌బాస్... ఏదైనా జరగొచ్చు’ అని హోస్ట్ నాని సీజన్ ప్రారంభంలోనే చెప్పారు. నాని అన్నట్టుగానే పరిస్థితులు మారుతున్నాయేమో అనిపిస్తోంది. అందరికంటే ఎక్కువగా ఈ షోలో పేరొచ్చింది కౌశల్‌కే. ప్రేక్షకుల్లో అతనికి చాలా ఆదరణ ఉంది. అలాగే ఇతని పేరు మీద ఓ ఆర్మీ కూడా క్రియేట్ అయి చాలా యాక్టివ్‌గా పనిచేస్తోంది. ఎలిమినేషన్‌లో కౌశల్ ఉన్నాడంటే దాదాపు 65శాతం ఓట్లు అతనొక్కడికే పడతాయి అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి కౌశల్‌ను విలన్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందా? అంటే ఔననే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అది బిగ్‌బాస్ హౌస్‌లో కాదండి... వెండితెరపై.

ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముగిశాక ఆయన నందమూరి బాలకృష్ణతో సినిమాను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కౌశల్‌ను విలన్‌గా బోయపాటి ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ సీజన్ 2 ముగియనుంది. షో నుంచి కౌశల్ బయటకు వచ్చిన వెంటనే అతన్ని కలిసి బోయపాటి కథను నెరేట్ చేస్తారని తెలుస్తోంది.