సినిమా వార్తలు

భారతీయుడు ఆగిపోలేదట


7 months ago భారతీయుడు ఆగిపోలేదట

గతంలో శంకర్ .. కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన 'భారతీయుడు' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి ఇటీవలే శంకర్ ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ కి మనస్పర్థలు వచ్చాయని, దీనితో ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే ఇవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని లైకా ప్రొడక్షన్స్ అధికార ప్రతినిధి స్పష్టం చేసినట్టుగా తమిళ మీడియా వెల్లడించింది. ప్రాజెక్టు ఆగిపోయిందనే విషయంలో ఎంతమాత్రం నిజం లేదని యూనిట్ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన రెండు భారీ షెడ్యూల్స్ ను పూర్తి చేయడం జరిగిపోయిందనీ, తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు చేస్తున్నామని అంటున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోందనీ, అవి పూర్తి కాగానే తదుపరి షెడ్యూల్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో, కాజల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.