సినిమా వార్తలు

క్రిష్ పై నమ్మకంతోనే... :సుమంత్


8 months ago క్రిష్ పై నమ్మకంతోనే... :సుమంత్

‘ఎన్.టి.ఆర్- కథానాయకుడు’లో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను ఆయన మనవడు సుమంత్ పోషించిన విషయం తెలిసిందే. ఈ నెల 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంలో తన తాతయ్య పాత్ర కోసం తాను అంతగా హోం వర్క్ చేయలేదని, ఇందుకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూను ఐదు నిమిషాల పాటు మాత్రమే చూశానని చెప్పాడు. తమ తాతయ్య గొంతుని అనుకరించే ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు. ఈ సినిమాలో తన ఫస్ట్ లుక్ అందరికీ బాగా నచ్చిందని, అదే తనకు కొండంత ధైర్యం ఇచ్చిందని  సుమంత్ చెప్పారు. దర్శకుడు క్రిష్ తమ తాతయ్య పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని. క్రిష్ పై నమ్మకంతోనే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నానని చెప్పారు. క్రిష్, బాలకృష్ణ..ఈ ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఈ చిత్రంలో తాను నటించే సాహనం చేసేవాడిని కాదని సుమంత్ పేర్కొన్నారు.