సినిమా వార్తలు

'వినయ విధేయ రామ', 'ఎఫ్ 2' కన్నా ముందుగానే రజినీ ‘పేట’


9 months ago 'వినయ విధేయ రామ', 'ఎఫ్ 2' కన్నా ముందుగానే రజినీ ‘పేట’

రజనీ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'పేట'పైనే నిలిచింది. కార్తీక్ సుబ్బరాజు ఎంచుకునే కాన్సెప్ట్ పై అత్యధిక అంచనాలు, రజనీ డిఫరెంట్ లుక్ నాయికలుగా సిమ్రాన్ - త్రిష ఉండటం ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరగడానికి కారణంగా నిలుస్తున్నాయి. ఇక హీరోగా వరుస విజయాలు అందుకుంటున్న విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషించడం ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచుతోంది. తమిళంలో ఈ సినిమాను జనవరి 11వ తేదీన విడుదల చేస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే అంటే జనవరి 10వ తేదీనే తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా తాజాగా చిత్ర యూనిట్  ప్రకటించింది. ఈ సినిమాకి  ఒకరోజు ముందు 'కథానాయకుడు' విడుదల కానుంది. 'పేట' మరుసటి రోజున 'వినయ విధేయ రామ' .. ఆ మరుసటి రోజున 'ఎఫ్ 2' థియేటర్లకు రానున్నాయి. ఇప్పుడ రజనీ కూడా సంక్రాంతి బరిలోకి దిగడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.