సినిమా వార్తలు

‘పడిపడి లేచే మనసు’సాంగ్ అదుర్స్


9 months ago ‘పడిపడి లేచే మనసు’సాంగ్ అదుర్స్

హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘పడిపడి లేచే మనసు’.ఈ సినిమా నుంచి ఇటీవలే టైటిల్ సాంగ్ ‘కల్లోలం’ విడుదలైన విషయం విదితమే. ఇది అమితంగా అలరిస్తున్న నేపధ్యంలో తాజాగా ‘హృదయం జరిపే’ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చగా, క్రిష్ణకాంత్ లిరిక్స్ రాశారు. ఈ సాంగ్ లో శర్వానంద్...సాయ పల్లవితో ప్రేమలో పడే సన్నివేశాలనుచూపించారు. శ‌ర్వానంద్, సాయిప‌ల్లవి జంట‌గా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

"లై" లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది.  కాగా "ప‌డిప‌డి లేచే మ‌న‌సు" లో శర్వా, సాయిపల్లవి కెమిస్ట్రీ అదిరిపోయిందంటున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు.. టీజర్ చూస్తుంటేనే ఈ విషయం అర్థమైపోతుంది. పైగా ఇందులో నేపాల్ షెడ్యూల్ సినిమాకు హైలైట్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో శ‌ర్వానంద్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు. పైగా ఈయ‌న‌కు ఇందులో గ‌తం మ‌రిచిపోయే పాత్ర‌లో కనిపించనున్నాడని సమాచారం.