సినిమా వార్తలు

అందంగా సాగిన 'సవ్యసాచి' లిరికల్ సాంగ్


11 months ago అందంగా సాగిన 'సవ్యసాచి' లిరికల్ సాంగ్

ఇటీవలే ‘శైలజారెడ్డి అల్లుడు’తో హిట్ కొట్టిన హీరో నాగ చైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో మన ముందుకు రానున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. "చాటుగ చాటుగ దాచిన మాటలు .. రోజులు రోజులు వేచిన చూపులు .. గీతలు దాటుకుని ఏవైపెళ్లాయో.. " అంటూ ఈ పాట మొదలవుతోంది.

ప్రేమలో పడిన నాయకా నాయికలు .. తమ మనసులోని భావాలకు అందమైన అక్షర రూపం ఇచ్చే క్రమంలో రూపొందిన పాటగా కనిపిస్తోంది. గతంలో కంటే ఈ సినిమాలో చైతూ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇక నిధి అగర్వాల్ గ్లామర్ చూస్తుంటే .. పెద్ద హీరోల సరసన కూడా వరుస అవకాశాలను దక్కనున్నాయని ఇట్టే అనిపించడం ఖాయమంటున్నారు.