సినిమా వార్తలు

బాలయ్యతో.. రకుల్ ‘ఆకు చాటు పిందె తడిసె'


11 months ago బాలయ్యతో.. రకుల్ ‘ఆకు చాటు పిందె తడిసె'

క్రిషి దర్శకత్వలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్న విషయం విదితమే. బాలకృష్ణ... తారకరాముని పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం, భారీ హంగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ చిత్రంలో దివంగత నటి శ్రీదేవి పాత్రను హీరోయిన్ రకుల్ పోషిస్తున్న విషయం వెల్లడైంది. అమె పాత్ర ఈ చిత్రం ఎలా ఉండబోతున్నదన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం  'కథానాయకుడు', 'మహా నాయకుడు' పేర్లతో రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సినీ పరిశ్రమకు చెందిన ఎందరో స్టార్లు నటిస్తుండగా, షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో 'వేటగాడు' చిత్రంలోని 'ఆకు చాటు పిందె తడిసె' సాంగ్ లో బాలయ్యతో కలసి అభినయించనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తొలి భాగం జనవరి 9న, రెండో భాగం జనవరి 24న విడుదల కానున్నాయి.