సినిమా వార్తలు

బాలయ్య డైరెక్టర్ కి ఊహించనంత పారితోషికం


9 months ago బాలయ్య డైరెక్టర్ కి ఊహించనంత పారితోషికం

ప్రస్తుతం హీరో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ పనుల్లో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత ఆయన బోయపాటితో కలిసి సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గతంలో బాలకృష్ణ .. బోయపాటిల కాంబినేషన్లో వచ్చిన 'సింహా'.. 'లెజెండ్' వంటి సినిమాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. ఆ రెండు సినిమాలకు మించి తన రాబోయే సినిమా ఉంటుందని బోయపాటి ప్రకటించి, బాలకృష్ణ అభిమానులను ఖుషీ చేశారు. బాలకృష్ణ సొంత బ్యానర్లో రూపొందనున్న ఈ సినిమాకి పారితోషికంగా బోయపాటికి 15 కోట్లు ముడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణతో బోయపాటి చేసిన రెండు సినిమాలు ఆయన కెరియర్లో చెప్పుకోదగిన స్థాయిలో నిలిచిపోయాయి. ఈ నేపధ్యంలో వచ్చే తరువాతి సినిమా వాటిని మించిన స్థాయిలో ఉంటుందనే భరోసాను కూడా బోయపాటి ఇచ్చారట. అందుకే బోయపాటికి ఈ స్థాయి పారితోషికాన్ని ఫిక్స్ చేశారనే వార్త వినిపిస్తోంది. ఈ స్థాయి పారితోషికం అందుకోవడం బోయపాటికి ఇదే ఫస్టుటైమ్ అనే టాక్ వినిపిస్తోంది.