సినిమా వార్తలు

‘అల్లూరి’గా అలరిస్తున్న బాలయ్య


9 months ago ‘అల్లూరి’గా అలరిస్తున్న బాలయ్య

తన సీనీ జీవితంలో చేయలేకపోయిన ఏకైక పాత్ర మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని దివంగత ఎన్టీఆర్ పలుమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆ ముచ్చటను తీర్చుకునేందుకు 'మేజర్ చంద్రకాంత్' చిత్రంలో వచ్చే ఓ పాటలో కాసేపు అల్లూరిగా ఎన్టీఆర్ కనిపించారు. ఇప్పుడిక ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ లో తండ్రి పాత్రను పోషిస్తున్న బాలకృష్ణ కూడా కొన్ని క్షణాల పాటు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. చిత్రం ప్రమోషన్ లో భాగంగా, అల్లూరిగా బాలయ్యను చూపిస్తూ విడుదల చేసిన పోస్టర్ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. ఈ పోస్టర్‌ లో బాలకృష్ణ అచ్చం ఎన్టీఆర్ మాదిరే కనిపిస్తున్నారని  నెటిజన్లు కితాబిస్తున్నారు.