సినిమా వార్తలు

ఎన్టీఆర్ కోసం 60 గెటప్పులలో బాలయ్య


1 year ago ఎన్టీఆర్ కోసం 60 గెటప్పులలో బాలయ్య

ఎన్టీఆర్ బయోపిక్ భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్నవిషయం విదితమే.  ఎన్టీఆర్ జీవితంతో సంబంధం ఉన్న అనేక మందికి సంబంధించిన పాత్రలు ఇందులో కనిపించబోతున్నాయని తెలుస్తోంది.  కాగా ఈ సినిమాలో  బాలకృష్ణ 60 విభిన్న గెటప్‌ లలో కనిపించనున్నారని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో ఏఎన్నార్‌ పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉందని సమాచారం. హీరో సుమంత్‌.. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్న విషయం విదితమే. సుమంత్ కూడా ఈ చిత్రంలో దాదాపు 8 డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. కాగా నవంబర్ కల్లా టాకీ పార్ట్ ని పూర్తి చెయ్యాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నారని సమాచారం. మరోవైపు సినిమా రంగంలో ఎన్టీఆర్ కు అనేక మందితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి.  బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన వారిలో విఠలాచార్య ఒకరు.

ఈ పాత్ర కోసం కోసం దర్శకుడు ఎన్.శంకర్ ను తీసుకున్నారని సమాచారం. శంకర్ కు సంబంధించిన సీన్స్ కొన్ని ఇప్పటికే షూట్ చేసినట్టుగా తెలుస్తున్నది.  సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానున్నది. బాలకృష్ణ నటించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా చాలా బాగా వచ్చాయని సమాచారం. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.