సినిమా వార్తలు

బోయపాటితో బాలయ్యబాబు సినిమా


9 months ago బోయపాటితో బాలయ్యబాబు సినిమా

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'సింహా', 'లెజెండ్' సినిమాలు సంచలన విజయాలను సాధించిన విషయ విదితమే. బాలకృష్ణ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాలుగా అవి నిలిచాయి. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు సెట్ అవుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉండటం వలన కొంత గ్యాప్ ఏర్పడింది. ఈ ఇద్దరూ కలిసి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ .. ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు తరువాత ఆయన చేయనున్న సినిమా బోయపాటిదేనని తెలుస్తోంది. బోయపాటి చేస్తోన్న 'వినయ విధేయ రామ' సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తరువాత బోయపాటి.. బాలకృష్ణ ప్రాజెక్టునే పట్టాలెక్కించనున్నాడని అంటున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే బాలకృష్ణ సినిమా ఉంటుందని తెలుస్తోంది. హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు ఒకవైపు బాలకృష్ణ మరోవైపు బోయపాటి ఇద్దరూ సిద్దమవుతున్నారు.