సినిమా వార్తలు

బాలకృష్ణ కామెడీ ఆర్టిస్ట్: నాగబాబు సెటైర్


9 months ago బాలకృష్ణ కామెడీ ఆర్టిస్ట్: నాగబాబు సెటైర్

హీరో బాలకృష్ణపై తాను చేసిన కామెంట్లను మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఒక ఇంటర్వూలో ఆయనను బాలకృష్ణ గురించి మాట్లాడమంటే ఆయనెవరో తనకు తెలియదనేశానని, తన వ్యాఖ్యలతో కొంతమంది ఫీల్ అయ్యారని తన స్నేహితుల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని అన్నారు. అలా అనడం తప్పుకదా, మీకు తెలియదా? అని వారు అడిగారని తెలిపారు. బాలకృష్ణ ఎవరో తెలియదు అని అనడం నిజంగానే మిస్టేక్ అని చెప్పారు. బాలకృష్ణ తెలియని వారు ఎవరుంటారని అన్నారు. ఆయన అందరికీ తెలుసని, ఆయన మంచి నటుడని, పెద్ద కమెడియన్ అని, హాస్యాన్ని అద్భుతంగా పండించగల అతి కొద్ది మంది నటుల్లో ఆయన ఒకరని నాగబాబు వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఆయన వల్లూరి బాలకృష్ణ ఫొటోను చూపించారు. ఈయనకు 'అంజిగాడు' అనే నిక్ నేమ్ కూడా ఉందని చెప్పారు. ఆయన మరణించి చాలా కాలమయిందని అన్నారు. ఎన్టీఆర్, కృష్ణలతో కలసి కూడా పని చేశారని, ఆయనను మర్చిపోవడమనేది తాను చేసిన పెద్ద తప్పిదమని చెప్పారు. మరోవైపు, బాలయ్య ఎవరో తెలియదని నాగబాబు చేసిన వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.