సినిమా వార్తలు

నిమ్మకూరును సందర్శించనున్న బాలయ్య, విద్యాబాలన్


8 months ago నిమ్మకూరును సందర్శించనున్న బాలయ్య, విద్యాబాలన్

బసవతారకం పాత్రను పోషించిన బాలీవుడ్ నటి విద్యాబాలన్ తో కలిసి, ఎన్టీఆర్‌ స్వగ్రామమైన నిమ్మకూరులో ఈనెల 7న నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు. ఈ మేరకు నిమ్మకూరులో ఏర్పాట్లు చేస్తున్నట్టు బాలకృష్ణ మిత్రుడు బుర్రా గాంధీ తెలిపారు. బాలకృష్ణ, విద్యాబాలన్ తో పాటు కల్యాణ్ రామ్ కూడా రానున్నారని సమాచారం. అక్కడ ముందుగా ఎన్టీఆర్, బసవతారకంల విగ్రహాలకు పూలమాలలు వేశాక, 'ఎన్టీఆర్' రెండో భాగానికి సంబంధించిన ఓ సీన్ ను గ్రామంలో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. హరికృష్ణగా నటిస్తున్న కల్యాణ్ రామ్ కూడా షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకునే వీరు, తరువాత రోడ్డు మార్గంలో 10 గంటల సమయానికి నిమ్మకూరు చేరుకుంటారని భోగట్టా.