సినిమా వార్తలు

బసవతారకం...తారకరాముడు..పోస్టర్ అదుర్స్!


9 months ago బసవతారకం...తారకరాముడు..పోస్టర్ అదుర్స్!

ఇప్పుడు తెలుగు ప్రేక్షకులందరి దృష్టి ఎన్టీఆర్ బయోపిక్ పైనే వుంది. చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు కొత్త పోస్టర్స్ విడుదల చేస్తూ అంచనాలు పెంచేస్తూ వస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ  .. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ వున్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. బసవతారకం హార్మోనియం వాయిస్తూ వుంటే, ఆ పక్కనే ఎన్టీఆర్ కూర్చుని ఆమె కళ్లలోకి సూటిగా చూస్తున్నట్టుగా వున్న ఈ పోస్టర్, ఆ దంపతుల మధ్యగల అనుబంధానికి అద్దం పడుతోంది. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా ఆడియో వేడుకను హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నారు. డిసెంబరు 21 సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక జరగనుంది. మొదటిభాగమైన 'కథానాయకుడు' జనవరి 9వ తేదీన .. రెండవ భాగమైన 'మహానాయకుడు' ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయనున్నారు.