సినిమా వార్తలు

ఎన్టీఆర్’ మామా అల్లుళ్లు అదుర్స్


1 year ago ఎన్టీఆర్’ మామా అల్లుళ్లు అదుర్స్

ఈరోజు వినాయక చవితి సందర్బంగా ‘యన్‌టీఆర్‌’ చిత్రబృందం అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఆయన అల్లుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా రానా దగ్గుబాటి ఫస్ట్‌లుక్స్‌ బయటకి వచ్చాయి. ఈసారి మామా అల్లుళ్లు కలిసే వచ్చారు. పోస్టర్‌లో ఎన్టీఆర్‌.. తన అల్లుడిపై ప్రేమగా చెయ్యివేసి మాట్లాడుతున్నట్లుగా చూపించారు. ఇదివరకు విడుదలైన లుక్స్‌ కంటే ఈ పోస్టర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్నారు. అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్‌ నటిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటోంది. మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కూడా కీలకంగా రూపొందిస్తున్నారట. ఎన్టీఆర్‌తో కేసీఆర్ అనుబంధం ప్రత్యేకమైనవి. టీడీపీ శ్రేణులకు రాజకీయాలు బోధించిన సత్తా ఉన్న నేత కేసీఆర్. ఎన్టీఆర్‌పై ప్రేమకు చిహ్నంగా తన కుమారుడికి ఆయన పేరే పెట్టుకొన్నారు. అలాంటి వ్యక్తి పాత్ర ఈ సినిమాలో లేకుంటే వెలితి అని భావించారట. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఓ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ను కలుసుకొన్న సీన్‌ ద్వారా కేసీఆర్‌ను చూపిస్తున్నారట. తన కుమారుడు కేటీఆర్‌ను వెంట తీసుకొని వెళ్లే సీన్‌ను చిత్రీకరించనున్నారట. అయితే కేసీఆర్ పాత్రకు ఓ ప్రముఖ నటుడిని ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది