సినిమా వార్తలు

వ‌ర్మ‌గారూ... ఇది మ‌రీ టూమ‌చ్‌!


7 months ago వ‌ర్మ‌గారూ... ఇది మ‌రీ టూమ‌చ్‌!

ట్విట్ట‌ర్‌లో రామ్‌గోపాల్‌ వ‌ర్మ సంగ‌తులు తెలుసుకుంటున్న నెటిజ‌న్లు చికాకు పడుతున్నార‌ట‌. మరీ ఇంత అతి ఏంటని ప్ర‌శ్నిస్తున్నారు. వర్మ తెరకెక్కించిన `లక్ష్మీస్ ఎన్టీఆర్` ట్రైలర్  విడుదలైంది. ట్రైల‌ర్‌లో నందమూరి కుటుంబ సభ్యుల్ని విలన్లుగా వర్మ చూపించార‌నే వాద‌న వినిపిస్తోంది. దీంతో ట్రైల‌ర్‌లో ఏముందో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి కనబరచడంతో వ్యూస్ విప‌రీతంగా వచ్చాయి.  దీంతో వర్మ మ‌రింత‌గా రెచ్చిపోతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, పీఎం నరేంద్ర మోదీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కేటీఆర్ `లక్ష్మీస్ ఎన్టీఆర్` ట్రైల‌ర్ చూశార‌ని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ట్రైలర్ చూస్తూ `ఈ ట్రైలర్ లో వీడిని ఎక్కడో చూసినట్టుంది` అని కామెంట్ చేసినట్టు వ‌ర్మ ట్వీట్ చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, త్రివిక్రమ్ అందరూ `లక్ష్మీస్ ఎన్టీఆర్` చూశార‌ని పేర్కొన్నారు. అయితే వీటిని చూస్తున్న‌ పలువురు నవ్వుకుంటున్నార‌ట‌. సినిమా పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజార‌డ‌మేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రికొంద‌రు ఈ చీప్ ట్రిక్స్ ఏమిటని విసుక్కుంటున్నార‌ట‌.