సినిమా వార్తలు

‘అతడు’ను తిరస్కరించిన మహానటుడు


9 months ago ‘అతడు’ను తిరస్కరించిన మహానటుడు

తెలుగు తెరపై అందాల కథానాయకునిగా పేరొందిన శోభన్ బాబు సుదీర్ఘ కాలం పాటు హీరోగా రాణించారు. ఆయన అభిమానులంతా కలిసి 'శోభన్ బాబు సేవాసమితి' పేరుతో ఈ నెల 25వ తేదీన అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదికగా మారనుంది. ఈ విషయాన్ని మీడియాకి తెలియజేయడానికి వచ్చిన మురళీమోహన్ మాట్లాడుతూ, శోభన్ బాబు గురించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. "శోభన్ బాబు ఒక నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోను దానిని మార్చుకోరు. అలాగే ఆయన ఒకసారి ఇక నటించకూడదనే నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో నేను 'అతడు' సినిమా తీస్తున్నప్పుడు అందులో ఒక కీలకమైన పాత్రను శోభన్ బాబు చేస్తే బాగుంటుందని భావించాను. అందుకోసం ఆయనకి బ్లాంక్ చెక్ పంపించాను. అయినా ఆయన సున్నితంగా తిరస్కరించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు" అని వివరించారు.