సినిమా వార్తలు

అర్జున్ రెడ్డి లో కంగుతినిపించే కొత్త‌కోణం


1 year ago అర్జున్ రెడ్డి లో కంగుతినిపించే కొత్త‌కోణం

విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం యువ హృదయాలను కొల్లగొడుతున్న హీరో. అర్జున్ రెడ్డి సినిమాలో పూర్తి ర‌ఫ్ క్యారెక్టర్ లో క‌నిపించిన విజ‌య్ తాజాగా సంతోషం, ఆనందం ఎక్క‌డున్నాయ‌ని వెతుకుతున్నారు. విజ‌య్ ఏంటీ? ఇటువంటి ఆలోచ‌న‌లేమిటి? అనే డౌట్ అంద‌రికీ క‌లుగుతుంది. కానీ ఇది నిజం. ఇటీవ‌ల విజ‌య్ సద్గురు జగ్గీవాస్‌దేవ్‌ను సంతోషం అంటే ఏంటి? సంతోషంతో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? అనే ప్రశ్నలు అడిగాడు. ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చిన సద్గురు.. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ.. ‘‘ఈ రోజుల్లో అందరూ డబ్బు గురించే ఆలోచిస్తున్నారు, అందులోనే సంతోషం ఉందని దాని వెంటే పడుతున్నారు. కొందరేమో మద్యం సేవించడం ద్వారా సంతోషం కలుగుతుందని, మరికొందరు అమ్మాయిలతో ఉంటే సంతోషం కలుగుతుందని అంటున్నారు. ఇంతకీ అసలు సంతోషం ఎక్కడుంది? సంతోషంతో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? అని అడుగుతూ ‘ఆనందం మనిషిలోపల ఉంటుంది.. అక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందని అని చెప్పొద్దు’ సరైన సమాధానం చెప్పండి’’ అని సద్గురుని అడిగాడు. ఈ ప్రశ్నలకు స్పందించిన సద్గురు.. ‘‘నమస్కారం విజయ్.. కొండంత మనిషివి నువ్వు. అలాంటి నువ్వు సంతోషంగా ఉండాలని కోరుతున్నావు. సంతోషంతో ఉండే మనిషి ఎలా ఉంటాడంటే.. నీలా, నాలా ఉంటాడని చెప్పుకోవచ్చు. సంతోషం అనేది ఒక సహజసిద్ధమైన పరిణామం. మనలో సంతోషం దాగి ఉంటుందని చెప్పొద్దంటూ నువ్ కండీషన్ పెట్టావు. కాబట్టి అలా చెప్పను. మనిషి అనుభవమే ఒక చర్య. అందుకే శాంతి, సంతోషం, ఆనందం ఇలా ఒక్కోదాన్ని ఒక్కో అనుభూతిగా చెప్పుకుంటాం. ఒకవేళ నువ్వే గనక ఒక రసాయన సూప్‌వి అయితే నువ్వు గొప్ప సూప్‌వా? లేదా ప్రియమైన సూప్‌వా? అనేది ఇక్కడ మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అది తెలిసిందంటే సంతోషం అంటే ఏంటో కూడా తెలుస్తుంది అని స‌ద్గురు స‌మాదాన‌మిచ్చారు. ఈ వీడియోను చూసిన వారంతా విజ‌య్ ప‌రిణితిని మెచ్చుకుంటూ, విజ‌య్ యువ‌త‌కు ఆద‌ర్శ ప్రాయుడంటూ తెగ పొగిడేస్తున్నార‌ట‌.