సినిమా వార్తలు

అనుష్క మూవీలో అర్జున్ రెడ్డి హీరోయిన్


8 months ago అనుష్క మూవీలో అర్జున్ రెడ్డి హీరోయిన్

'భాగమతి' హిట్ తరువాత అనుష్క నుంచి రానున్న సినిమా కోసం అభిమానులంతా చాలాకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కథాబలం, వైవిధ్యం కలిగిన కథలను మాత్రమే ఎంచుకోవాలనే ఉద్దేశంతో అనుష్క కొంత గ్యాప్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఆమె హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా చేయడానికి అంగీకరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్ నిర్మించే ఈ సినిమాకి, 'సైలెన్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. హారర్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాలో అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజుతో పాటు, హాలీవుడ్ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ అమెరికాలో ప్రారంభంకానుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అనుష్క కెరియర్లో ఇది మరో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తోంది.