సినిమా వార్తలు

19న 'అరవింద సమేత' రెండో పాట


11 months ago 19న 'అరవింద సమేత' రెండో పాట

'అరవింద సమేత వీర రాఘవ' సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనున్నట్టు త్రివిక్రమ్ ఎప్పుడో ప్రకటించారు. దీనికి అనుగుణంగా  ఈ సినిమాకి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఒక వైపున చిత్రీకరణను పూర్తి చేస్తూ, మరో వైపున ఒక్కో లిరికల్ వీడియోను రిలీజ్ చేస్తున్నారు. అలా రీసెంట్ గా 'అనగనగనగా.. ' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో రేపు(19) సాయంత్రం 4.50 గంటలకు 'పెనివిటి ..' అనే రెండో పాటను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. రాయలసీమ ఆచార వ్యవహారాల నేపథ్యంలో చిత్రీకరించిన పాటగా దీనిని గురించి చెబుతున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, జగపతిబాబు .. నాగబాబు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.