సినిమా వార్తలు

కొత్త కోణంలో 'అరవింద సమేత' సీమ ఫ్యాక్షన్


1 year ago కొత్త కోణంలో 'అరవింద సమేత' సీమ ఫ్యాక్షన్

'అరవింద సమేత వీర రాఘవ' .. వచ్చేనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో రాయలసీమ యాస మాట్లాడటమే కాదు .. ఫ్యాక్షన్ నేపథ్యంలో కనిపించనున్నాడు. ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో ఇంతవరకూ చాలా సినిమాలు వచ్చాయి. రాయల సీమలో ఫ్యాక్షన్ కారణంగా భర్తలను .. పిల్లలను .. అన్నదమ్ములను కోల్పోయిన స్త్రీల పరిస్థితులకి సంబంధించిన కోణంలో ఈ కథ కొనసాగుతుందట. వాళ్ల ఎమోషన్స్ చూసిన కథానాయకుడు ఎలా స్పందిస్తాడు? .. ఏం చేస్తాడు? అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితమైందట. యాక్షన్ .. ఎమోషన్ తో ముడిపడిన ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా పాటలకి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో, సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందనే నమ్మకంతో ఎన్టీఆర్ అభిమానులు వున్నారు.