సినిమా వార్తలు

కళ్యాణ్ రామ్‌తో ‘అరవింద సమేత’ ప్రొడక్షన్ హౌస్ సినిమా


9 months ago కళ్యాణ్ రామ్‌తో ‘అరవింద సమేత’ ప్రొడక్షన్ హౌస్ సినిమా

‘‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తదితర విజయవంతమైన చిత్రాలను నిర్మించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్. ఈ ఏడాదిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రాన్ని నిర్మించింది. ఈ సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ మరో ఆసక్తికరమైన చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. తమ గత చిత్రాన్ని ఎన్టీఆర్‌తో నిర్మించిన ఆయన అతి త్వరలో ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ యాక్షన్ థ్రిల్లర్ ‘118’తోనూ, ‘ఎన్టీఆర్ బయోపిక్’ లోనూ నటిస్తున్నారు. ఈ సినిమాలు వచ్చే ఏడాది ఆరంభంలో తెరపైకి రానున్నాయి. ఈ చిత్రాల తరువాత యువ దర్శకుడు విరించి వర్మ కాంబినేషన్‌లో కళ్యాణ్ రామ్ ఓ మూవీ ప్లాన్ చేసుకున్నాడని సమాచారం. ఈ చిత్రాన్నే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించబోతుందని సమాచారం. ‘‘ఉయ్యాల జంపాల, మజ్ను’’ చిత్రాలతో అలరించిన విరించి వర్మ.. కళ్యాణ్ రామ్ ఇమేజ్‌కు తగినవిధంగా తయారు చేసుకున్న ఆసక్తికరమైన కథ ఇదని, వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా నిర్మితంకానుందని టాలీవుడ్ టాక్. మరి ఈ ప్రాజెక్ట్‌ కళ్యాణ్ రామ్ కు మరో హిట్ ఇస్తుందేమో వేచిచూడాలి.