సినిమా వార్తలు

'ఖైదీ నెంబర్ 150'కి చేరువలో ‘అరవింద సమేత


11 months ago 'ఖైదీ నెంబర్ 150'కి చేరువలో ‘అరవింద సమేత

దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అరవింద సమేత'కు కాసుల వర్షం కురిసింది. అటు త్రివిక్రమ్ కెరియర్లోను .. ఇటు ఎన్టీఆర్ కెరియర్లోను మంచి చిత్రంగా నిలిచింది. 2 వారాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా 150 కోట్ల మార్క్ ను దాటేసింది. తెలుగులో అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచే దిశగా పరుగులు తీస్తోంది. టాలీవుడ్లో అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాల్లో .. 164 కోట్ల గ్రాస్ తో 5వ స్థానంలో 'ఖైదీ నెంబర్ 150' వుంది. ఇంతవరకూ 158 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన 'అరవింద' 5వ స్థానానికి చేరువలో వుంది.

ఇంకా 6 కోట్లకి పైగా వసూళ్లు వస్తే ఆ రికార్డును అధిగమించడం జరుగుతుందని అంటున్నారు. అందుకు మరో వారం రోజులు పట్టొచ్చని తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరియర్లోనే 'అరవింద' టాప్ గ్రాసర్ గా నిలవడం, 150 కోట్లు రాబట్టిన ఆయన తొలి చిత్రం ఇదే కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.