సినిమా వార్తలు

20న ‘అరవింద సమేత’ ఆడియో లాంచ్


1 year ago 20న ‘అరవింద సమేత’ ఆడియో లాంచ్

‘యంగ్‌ టైగర్’ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వినాయక చవితి సందర్బంగా చిత్ర బృందం తారక్‌కు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ ఆడియో విడుదల తేదీని కూడా వెల్లడించింది. సెప్టెంబర్‌ 20న ఘనంగా ఆడియో లాంచ్‌ వేడుకను నిర్వహించనున్నారు. పోస్టర్లో ఒక పక్కకు చూస్తూ నవ్వుతున్నట్లుగా ఉన్న తారక్‌ ఫొటో అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటోంది. ప్రముఖ హాస్యనటుడు, కథానాయకుడు సునీల్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. తారక్‌.. వీరరాఘవ రెడ్డి అనే చిత్తూరు కుర్రాడిగా, రాయలసీమ యాసలో మాట్లాడే పాత్రలో కనిపించనున్నారు. సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. దసరాకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో ఈ ఏడాది ద్వితీయార్ధంలో రావాల్సిన అతి పెద్ద సినిమా ‘అరవింద సమేత’నే. జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు అమితంగా వున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. ఈ చిత్ర విడుదలకు ఇంకో నెల రోజులు కూడా సమయం లేదు. ముందు అనుకున్న ప్రకారం అయితే వినాయక చవితి నుంచే ఈ చిత్ర ప్రమోషన్లు మొదలుపెట్టాల్సింది. కానీ ఈ చిత్ర షూటింగ్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. మధ్యలో హరికృష్ణ మరణంతో ఎన్టీఆర్ కొన్ని రోజులు అందుబాటులో లేకపోవడంతో షెడ్యూళ్లు కొంచెం అటుఇటు అయ్యాయని తెలుస్తోంది.