సినిమా వార్తలు

20న‌ అరవింద సమేత' ఆడియో


1 year ago 20న‌ అరవింద సమేత' ఆడియో

ఫ్యాక్షన్ తో ముడిపడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'అరవింద సమేత వీర రాఘవస త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్ కనిపించనున్న ఈ సినిమాలో ఆయన జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ దిశగా చకచకా పనులు జరిగిపోతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన ఆడియో వేడుకను హైదరాబాద్ లోని 'నోవాటెల్' హోటల్లో నిర్వహించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని స‌మాచారం. సిరివెన్నెల .. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.