సినిమా వార్తలు

తుపాకి' సీక్వెల్ కి సన్నాహాలు


9 months ago తుపాకి' సీక్వెల్ కి సన్నాహాలు

రజనీకాంత్ తో సినిమా చేయడానికి మురుగదాస్ రెడీ అవుతున్నాడన్న విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని మురుగదాస్ ముందుగానే చెప్పేశాడు. ఈ సినిమా తరువాత అజిత్ తో ఒక సినిమా .. విజయ్ తో ఒక సినిమా చేయనున్నట్టు కూడా మురుగదాస్ సంకేతాలిచ్చారు. ఇంతకుముందు విజయ్ తో 'కత్తి' .. 'తుపాకి' చేసిన మురుగదాస్, ఇటీవల చేసిన 'సర్కార్'తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. విజయ్ తో మురుగదాస్ చేసే సినిమా .. 'తుపాకి' సీక్వెల్ అనే టాక్ వినిపిస్తోంది. గతంలో 'తుపాకీ' ఎంత విజయం సాధించిందో తెలిసినవిషయమే. అదే తీరులో ఉండబోయే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.