సినిమా వార్తలు

నాగార్జున బంగార్రాజులో అనుష్క?


1 year ago నాగార్జున బంగార్రాజులో అనుష్క?

అక్కినేని నాగార్జున నటించిన తాజాచిత్రం దేవదాస్ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత నాగార్జున చేయబోతున్న సినిమాలు రెండున్నాయి. అందులో మొదటిది కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోందని సమాచారం. అక్కినేని నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయ‌నా సినిమాతో నాగార్జున కెరీర్ లోనే తొలి 50 కోట్ల సినిమా ఇచ్చాడు క‌ళ్యాణ్ కృష్ణ‌. అక్కినేని కంపౌండ్ లోనే రెండేళ్ల‌కు పైగా ఉండి రెండు హిట్లు ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. సోగ్గాడేతో పాటు చైతూ హీరోగా వ‌చ్చిన రారండోయ్ వేడుక చూద్దాం కూడా బాగానే ఆడింది. అయితే అక్కినేని కంపౌండ్ వ‌దిలేసి నేల‌టికెట్ అంటూ ర‌వితేజ‌ చెంతచేరి డిజాస్ట‌ర్ అందించాడు. దాంతో ఇప్పుడు మ‌ళ్లీ మొద‌ట్నుంచీ లెక్క పెడుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈయ‌న నాగార్జున‌తోనే సినిమాకు సిద్ధం అవుతున్నాడు. సోగ్గాడే చిన్నినాయ‌నాకు ప్రిక్వెల్ గా ఓ క‌థ రాసుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. దీనికి నాగార్జున స్వయంగా బంగార్రాజు అనే టైటిల్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసారు.

ఇప్ప‌టికే ఓ సారి క‌థ చెప్పినా కూడా నాగ్ కు న‌చ్చ‌లేదు.. దాంతో ఇప్పుడు సీనియ‌ర్ రైట‌ర్ స‌త్యానంద్ సహాయంతో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ రెడీ చేసాడు. ఇది నాగార్జునకు ఎంతో నచ్చిందట. ఈ నేపద్యంలో ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్కను అనుకుంటున్నారట. ఇందుకోసం ఆమెను సంప్రదిస్తున్నారని సమాచారం. ఈ బంగార్రాజు సినిమాతోపాటు ఈ మూవీతో పాటు చిలాసౌ సినిమాతో మంచి విజయం సాధించిన నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో నాగార్జున ఒక సినిమా చేయబోతున్నాడు. మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాను త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే నాగార్జున బాక్ టు బ్యాక్ సీక్వెల్స్ చేస్తున్నాడు. రెండు సినిమాలను నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. సీక్వెల్స్ చేస్తే బెటరని భవిస్తూ నాగ్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు.