సినిమా వార్తలు

అనుష్క సినిమాలు తగ్గించడానికి కారణమిదే!


9 months ago అనుష్క సినిమాలు తగ్గించడానికి కారణమిదే!

బ్లాక్ బస్టర్ హిట్ ‘బాహుబలి’ చిత్రం తర్వాత అనుష్క మరిన్ని చిత్రాలు చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఆమె అనూహ్యంగా బరువు పెరిగిన కారణంగా సినిమాలకు దూరంగా ఉందని భోగట్టా. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క ఆ బరువు తగ్గడం కోసం చాలానే కష్టపడిందంటారు. బరువు ఏమాత్రం తగ్గకుండా చేసిన భాగమతి సినిమా ఆమెను నిరాశకు గురిచేసింది. ఇటువంటి బరువుతో సినిమాలు చేస్తే ప్రేక్షకులను అలరించడం కష్టమనే భావనకు అనుష్క వచ్చిందట. దీనికితోడు బరువుతో ఉంటే హీరోలతో ఛాన్స్ లు కూడా రావనే ఆలోచనకు వచ్చిన అనుష్క గత కొంత కాలంగా బరువుతగ్గేందుకు కష్టపడ్డట్లు సమాచారం. ఎట్టకేలకు అనుష్క తన మునుపటి రూపానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా మీడియా కళ్లకు దూరంగా ఉంటూ వస్తున్న అనుష్క జనవరిలో జరిగే రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహ కార్యక్రమంలో పాల్గొనబోతుందట. అప్పుడు అనుష్క మీడియా కంటికి చిక్కడం ఖాయం. అందుకే అంతకు ముందే ఆమె బరువు తగ్గాలని నిర్ణయించుకుందట.

తాజాగా అనుష్క చాలా బరువు తగ్గిందని, మిర్చి సినిమాలో ఎలాంటి లుక్ లో ఆమె కనిపించిందో ఇప్పుడు అలాగే కనిపించబోతున్నదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు అనుష్క బరువు తగ్గడమే ఆలస్యం ఆమెతో సినిమాలు చేయాలని పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. అలాగే పెద్ద ఎత్తున ఆమెకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చేందుకు క్యూలో ఉన్నారని భోగట్టా. అయితే అనుష్క మాత్రం ఆచి తూచి సినిమాలకు కమిట్ అవుతున్నదట. అనుష్క ప్రస్తుతానికి కోన వెంకట్ నిర్మాణంలో మాధవన్ తో కలిసి ఒక సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఆ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుండి మొదలయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభాస్ తాజా చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించేందుకు అనుష్క ఓకే చెప్పినట్లు సమాచారం.