సినిమా వార్తలు

కొలిక్కి వచ్చిన అనుష్క పెళ్ళి ప్రయత్నాలు? సినిమాలకు దూరం?


1 year ago కొలిక్కి వచ్చిన అనుష్క పెళ్ళి ప్రయత్నాలు? సినిమాలకు దూరం?

స్టార్ హీరోయిన్ అనుష్కకి సంబందించిన ఒకవార్త మళ్లీ తెరమీదకు వచ్చింది. ఆమెకు సంబంధించిన పెళ్లి సంబంధాలు ఒక కొలిక్కి వచ్చాయని, పెళ్లి చేసుకుని త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెబుతుందనే ఊహాగాలు వెలువుడుతున్నాయి. బాహుబలి తరువాత అనుష్క కేవలం ఒక్క చిత్రంలో మాత్రమే నటించింది. అది కూడా లేడి ఓరియెంటెడ్ చిత్రం భాగమతి. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత అనుష్క మరో చిత్రంలో నటించలేదు. కొత్త సినిమాకు కూడా ఆమె అంగీకారం తెలపలేదు. దీనితో అనుష్క గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. అన్ని రకాల పాత్రలకు సూటయ్యే అతికొద్దిమంది సౌత్ హీరోయిన్లలో అనుష్క ఒకరు. గ్లామర్ పాత్రాలు, చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పాత్రలు, లేడి ఓరియెంటెడ్ చిత్రాలు ఇలా అన్ని విధాలుగా అనుష్క భాగమతి చిత్రం వరకు దూసుకుపోయింది. సాహసోపేతమైన పాత్ర ఉంటే ముందుగా దర్శక నిర్మాతలకు అనుష్క గుర్తుకు వచ్చేది. అంతలా సౌత్ లో అనుష్క ప్రభావం కొనసాగింది. తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అనుష్క సినిమాలకు దూరం కాబోతోందా అనే ఊహాగానాలు అధికం అవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతోంది.