సినిమా వార్తలు

ప్రభాస్ కు అనుష్క సర్‌ప్రైజ్ గిఫ్ట్


11 months ago ప్రభాస్ కు అనుష్క సర్‌ప్రైజ్ గిఫ్ట్

నిన్న‌డార్లీంగ్ ప్ర‌భాస్ పుట్టిన రోజు వేడుకగా జరిగింది. ఆయ‌న అభిమానులు ప్ర‌భాస్ పుట్టిన రోజును ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ప్ర‌భాస్ ఫ్యాన్స్ సోష‌ల్ బ‌ర్త్ డే హ్యాష్ ట్యాగ్‌ల‌తో అభినందనలు తెలిపారు. ప్ర‌భాస్ కూడా వారికి స‌ర్‌ప్రైజ్ గిప్ట్ ఇచ్చాడు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న సాహో సినిమా మేకింగ్‌ వీడియోతో పాటు, సినిమాలో ప్ర‌భాస్ పోస్ట్‌ర్‌ని విడుద‌ల చేసి అభిమానుల‌కు ఆనందాన్ని అందించాడు. ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా ప్ర‌భాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే వీరిందరికీ భిన్నంగా ప్ర‌భాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లను హీరోయిన్ అనుష్క‌ తెలిపింది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో సినిమా షూటింగ్‌లో భాగంగా దుబాయ్‌లో ఉన్నాడు.

అనుష్క దుబాయ్ వెళ్లి మ‌రీ ప్ర‌భాస్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడంతో పాటు స‌ర్‌ప్రైజ్ గిప్ట్ కూడా ఇచ్చింద‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్, అనుష్క‌ల మ‌ధ్య ఎఫైర్ ఉంద‌ని, వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నార‌ని గతంలో చాలానే వార్త‌లు వ‌చ్చాయి. అయితే మేం జ‌స్ట్ ఫ్రెండ్స్, మా మ‌ధ్య‌లో ఎటువంటి ప్రేమ లేద‌ని వారు వెల్లడించారు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అనుష్క‌ మాత్రం సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నదని సమాచారం. అయితే ప్రభాస్ కు అనుష్క ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలియాల్సివుంది.