సినిమా వార్తలు

నిరాశకలిగిస్తున్న అనుష్క నిర్ణయం


9 months ago నిరాశకలిగిస్తున్న అనుష్క నిర్ణయం

అందం, అభినయం కలబోసినట్టుండే కథానాయిక అనుష్కకు ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో మంచి క్రేజ్ వుంది. 'బాహుబలి' సినిమాతో అనుష్క క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. దీంతో అనుష్క ఒక సాధారణమైన కథానాయిక కాదనే అభిప్రాయానికి ప్రేక్షకులంతా వచ్చేశారు. ప్రత్యేకమైన పాత్రల్లో ఆమెను చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. దాంతో ఆ క్రేజ్ ను నిలుపుకోవడానికి అనుష్క కూడా గ్లామర్ పాత్రలను తగ్గించుకుంటూ వస్తోంది. కథలో దమ్ము వుండి, అదికూడా నాయిక ప్రాధాన్యత కలిగినదైతేనే ఆమె అంగీకరిస్తోంది.

ఈ కోవలోనే 'భాగమతి' తరువాత మరోమారు నాయిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుకే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ సినిమాలో మాధవన్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలావుండగా తాజాగా ఫిల్మ్ నగర్లో మరో వార్త షికారు చేస్తోంది. ఇకపై ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేయాలనే నిర్ణయానికి అనుష్క వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఇది అనుష్క అభిమానులకు నిరాశను కలిగిస్తుందని అంటున్నారు.