సినిమా వార్తలు

‘అంతరిక్షం’ ఇలా ఉంటుందట!


9 months ago ‘అంతరిక్షం’ ఇలా ఉంటుందట!

వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి 'అంతరిక్షం' సినిమాను రూపొందించారు. తెలుగులో తొలిసారిగా 'అంతరిక్షం' నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అంతరిక్షానికి సంబంధించి ఏం చూపిస్తారు? అనే సందేహం ప్రేక్షకులకు కలగడం సహజం. అసలు ఈ సినిమా ఏయే అంశాలను టచ్ చేస్తుంది? తాము ఆశించేవి ఈ తరహా సినిమాలో వుంటాయా? అనే విషయాలను తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంటుంది. అందుకే ఈ సినిమా టీమ్ వరుణ్ తేజ్ తో ఒక వీడియో చేసి రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ఏ అంశాలు ఉంటాయి అనేదాని గురించి   వీడియో ద్వారా తెలియజేశారు. ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడానికి చేసిన ఈ ప్రయత్నం ఆకట్టుకునేలావుందనే టాక్ వినిపిస్తోంది.