సినిమా వార్తలు

వ‌రుణ్ 'అంతరిక్షం చూద్దాం రండి


9 months ago వ‌రుణ్ 'అంతరిక్షం చూద్దాం రండి

వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'అంతరిక్షం చిత్రం నిర్మితమైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికెట్ ను అందుకుంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తికావడంతో, ఆ తరువాత చేయాల్సిన‌ పనులను వేగవంతం చేశారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ తో పాటు అదితీరావు వ్యోమగామిగా కనిపించనుండగా, పార్వతీ టీచర్ పాత్రలో లావణ్యత్రిపాఠి అల‌రించ‌నుంది. రెహ్మాన్ (రఘు) ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించాడు. అంతరిక్షం నేపథ్యంలో తెలుగులో తొలిసారిగా నిర్మితమైన సినిమా ఇదే కావ‌డం విశేషం. అంద‌కే ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో ఆసక్తి నెల‌కొంది. సముద్రం - జలాంతర్గామి నేపథ్యంలో 'ఘాజీస రూపొందించి, మెప్పించిన సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను రూపొందించారు.