సినిమా వార్తలు

అంతరిక్షం’ నుంచి లిరికల్ సాంగ్ విడుద‌ల‌


9 months ago అంతరిక్షం’ నుంచి లిరికల్ సాంగ్ విడుద‌ల‌

హీరో వరుణ్ తేజ్ కీల‌క‌పాత్ర‌లో ‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంతరిక్షం’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై క్రిష్ జాగర్లమూడి సమర్పణలో స్పేస్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. టాలీవుడ్‌లో ఇప్పటి వరకూ చూడని కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెల‌కొన్నాయి. వరుణ్ తేజ్ సరసన అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘సమయమా’ వీడియోను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. అనంత శ్రీరామ్ అందించిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం సినిమాను మరో మెట్టు ఎక్కించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 21న విడుద‌లకానుంది.