సినిమా వార్తలు

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి మరో పాట విడుదల


7 months ago ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి మరో పాట విడుదల

తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే ట్రైలర్ తో పాటు రెండు పాటల రిలీజ్ తో రాజకీయంగావేడి పుట్టించిన వర్మ తాజాగా సినిమాలోని ఓ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతిల మధ్య ఉన్న ప్రేమానురాగాల నేపథ్యంలో ‘నీ ఉనికి నా జీవితానికి అర్థం’ అనే పాటను వర్మ తాజాగా విడుదల చేశారు. ఈ పాటకు సిరా శ్రీ సాహిత్యం అందించారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. కల్యాణ్ మాలిక్‌ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను మార్చి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.