సినిమా వార్తలు

‘ఎన్టీఆర్’ నుంచి మరో పోస్టర్ విడుదల


10 months ago ‘ఎన్టీఆర్’ నుంచి మరో పోస్టర్ విడుదల

నటరత్ననందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా భారీస్థాయిలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో పలు కీలక పాత్రల్లో విద్యాబాలన్, రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్, సుమంత్, నందమూరి కల్యాణ్‌రామ్ తదితరులు నటిస్తున్నారు. ఈ రోజు రానా పుట్టిన రోజు. బర్త్ డే కానుకగా నిన్ననే రానాకు సంబంధించిన ఒక పోస్టర్‌ను విడుదల చేయగా, ఈరోజు రానాకు విషెస్ చెబుతూ మరో పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చంద్రబాబు గెటప్‌లో ఉన్న రానా ఠీవిగా నడుచుకుంటూ వస్తున్నట్టుగా ఉన్న పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.