సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ లో వినాయక్


11 months ago ఎన్టీఆర్ బయోపిక్ లో వినాయక్

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ వేగంగా సాగుతోంది. ఈ సినిమాలో చంద్రబాబునాయుడిగా రానా, హరికృష్ణగా కల్యాణ్ రామ్, ఏఎన్నార్ గా సుమంత్, శ్రీదేవిగా రకుల్, జయప్రదగా తమన్నా నటిస్తున్నారు. అలాగే దర్శకుడు కేవీ రెడ్డిగా క్రిష్, విఠలాచార్యగా ఎన్.శంకర్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దాసరి నారాయణరావు పాత్రలో వీవీ వినాయక్ నటించనున్నారని తెలుస్తోంది.

దాసరి, ఎన్టీ రామారావు కాంబినేషన్లో వచ్చిన సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, విశ్వరూపం మొదలైన సినిమాలు సంచలన విజయం సాధించాయి. అందుకేఎన్టీఆర్ బయోపిక్ లో దాసరి నారాయణరావు పాత్రను చూపించవలసిన అవసరం ఏర్పడిందట. ఈ పాత్రకి గాను వినాయక్ అయితే బాగుంటుందని భావించిన క్రిష్ ఆయనను ఒప్పించారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో త్వరలోనే దాసరి పాత్రకు సంబంధించిన సన్నివేశాలను వినాయక్ పై చిత్రీకరించనున్నట్టు సమాచారం.