సినిమా వార్తలు

మర్డర్ మిస్టరీ నేపధ్యంలో ‘కల్కి’


11 months ago మర్డర్ మిస్టరీ నేపధ్యంలో ‘కల్కి’

‘గరుడవేగ’తో హీరో రాజశేఖర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు ‌. ‘అ’తో విమర్శకుల్ని ఆకట్టుకున్నారు ప్రశాంత్‌ వర్మ. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం ఓ ప్రయోగంగా మిగిలిపోయింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న చిత్రం‘కల్కి’. సి.కల్యాణ్‌, శివానీ, శివాత్మిక నిర్మాతలు. 1983 నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ మర్డర్‌ మిస్టరీ చుట్టూ నడుస్తుందని సమాచారం. త్వరలో హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలుకానుందని తెలుస్తోంది. ఇందు కోసం నగర శివార్లలో ఓ భారీ సెట్‌ రూపొందిస్తున్నారు. కళా దర్శకుడు నాగేంద్ర ప్రసాద్‌ ఈసెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం కథానాయిక కోసం  కసరత్తులు జరుగుతున్నాయి. ఇద్దరు ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. త్వరలో ఒకరిని ఖరారు చేస్తారని సమాచారం.