సినిమా వార్తలు

‘అరవింద సమేత’ నుంచి మరో లిరికల్ సాంగ్‌ !


1 year ago ‘అరవింద సమేత’ నుంచి మరో లిరికల్ సాంగ్‌ !

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. ‘వీర రాఘవ’ అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం సమకూరుస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషారెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు లిరికల్ సాంగ్స్ ప్రేక్షక లోకాన్ని బాగా ఆకట్టుకోగా.. తాజాగా మరో లిరికల్ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుద‌ల చేసింది. ‘‘ఏడ పోయినాడో’’ అంటూ సాగే ఈ పాట.. అంతకుముందు విడుదలైన పాటలను మించి ఆకట్టుకుంటోందని అంటున్నారు ప్రేక్షకులు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, పెంచల్ దాస్ రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ‘కత్తి మీద సామే నడకనుకుంటే.. పాడే పడకవుతుంది.. ఆ పాడె మీద పడుకున్న వారిని చూసి అయిన వాళ్ల కడుపుకోత ఎలా ఉంటుందనేది ఈ పాటలో చెప్పామ‌ని సిరివెన్నెల సీతారామశాస్త్రి వివ‌రించారు.