సినిమా వార్తలు

'అరవింద సమేత' నుంచి మరో లీక్?


1 year ago 'అరవింద సమేత' నుంచి మరో లీక్?

త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి మొదటి నుంచి కూడా లీకుల సమస్య తలెత్తుతోంది. ఎన్టీఆర్, నాగబాబు తదితరులకు సంబంధించిన యాక్షన్ సీన్ ఫోటోలు కొన్ని ఆమధ్య బయటికి వచ్చాయి. అప్పటి నుంచి త్రివిక్రమ్ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టుగా వినికిడి. కానీ తాజాగా అదే ఫైట్ సీన్ కి సంబంధించిన వీడియోను ఇంటర్నెట్ లో లీక్ చేసినట్టు సమచారారం. ఎన్టీఆర్, నాగబాబు కార్లో వెడుతూ వుంటే విలన్ గ్యాంగ్ దాడి చేసే సీన్ ఇది. సినిమాలోని కీలకమైన ఈ ఫైట్ సీన్ లీక్ కావడం ఎన్టీఆర్ అభిమానులకు అసంతృప్తిని కలిగిస్తోంది. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనున్నారు.