సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్... మరో ఇంట్రెస్టింగ్ న్యూస్


9 months ago ఆర్ఆర్ఆర్... మరో ఇంట్రెస్టింగ్ న్యూస్

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అగ్ర దర్శకుడు రాజమౌళి స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ద్వయంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రూపొందిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క విషయం వెల్లడవుతుండటంతో మరింత హైప్ వస్తోంది. ఈ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల యాక్షన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుందని తెలుస్తోంది. రెండవ షెడ్యూల్ జనవరి 19నుండి 5 రోజులపాటు హైద్రాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని, చరణ్ కు బాబాయ్ గా నటించనున్నాడట. కోలీవుడ్ లో ఎంతో పేరొందిన ఈ డైరెక్టర్, యాక్టర్ ఈ చిత్రంతో తెలుగులోకి అడుగు పెడుతున్నారు. రూ. 300 కోట్ల బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం 2020లో తెలుగు తో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.