సినిమా వార్తలు

'దేవదాస్' నుంచి ఆకట్టుకుంటున్న మరో పాట


1 year ago 'దేవదాస్' నుంచి ఆకట్టుకుంటున్న మరో పాట

హీరోలు నాగార్జున, నాని కథానాయకులుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'దేవదాస్' సినిమా రూపొందుతున్న విషయం విదితమే. ఆకాంక్ష సింగ్,రష్మిక మందన కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. "ఏమో ఏమో ఏమో మెరుపుతీగ ఎదురై నవ్విందేమో .. ఏమో ఏమో ఏమో వెలుగు వాగు నాలో పొంగిందేమో .." అంటూ నాని .. రష్మిక మందనలపై ఈ సాంగ్ సాగుతోంది. ప్రేమలో పడిన కుర్రాడు .. ఆ ప్రియురాలిని తలచుకుంటూ అనుభూతుల అంచుల మీదుగా జారిపోతూ పాడుకునే పాట ఇది. సిరివెన్నెల పద ప్రయోగాలతో మనసు అలలపై తెరచాప పడవలా తేలే పాటలా సాగిపోతుంది.  మణిశర్మ సంగీతం .. సిద్ శ్రీరామ్ ఆలాపన ఈ పాటను హృదయాలకు ఆకట్టుకుంటోంది. మల్టీస్టారర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాను, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.